నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్ళిచేసుకోకూడదనుకున్నాను.
మరో తార జవాబిచ్చింది: నేను కూడా అంతే నా పెళ్ళి అయ్యేంత వరకూ నాకు ఇరవై ఐదు సంవత్సరాలు రానివ్వకూడదనుకొంటున్నాను.
ప్రయాణంలో ప్రియురాలిని తీసుకెళ్ళటం నీకిష్టమా లేక ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళడం ఇష్టమా? అడిగాడు మిత్రుణ్ణి ఒకతను. నా మటుకు నేను పుస్తకాన్ని తీసుకెళ్ళడానికే ఇష్టపడతాను.ఎందుకంటే పుస్తకం బోర్ కొట్టిందనుకో కిటికీలోంచి బయటకు
విసిరేయ వచ్చు జవాబిచ్చాడు మిత్రుడు.
ఒక మిత్రుడు: మీ భార్యభర్తల సంబంధాల మధ్య ఏదో అడ్డు
ఉందని విన్నాను నిజమేనా?
మరో మిత్రుడు: ఔను బ్రదర్. నేనూ నా భార్య ఎప్పుడూ గొడవ పడదామని కొట్టుకోవడం మొదలు పెడతామో అప్పుడు మా పొరుగింటి వాళ్ళంతా అడ్డొచ్చి విడగొట్టేస్తుంటారు!.
డాక్టర్: ఇక్కడ నేను హాస్పిటల్ పెడితే ఎలా ఉంటుంది.
మిత్రుడు: బాగానే ఉంటుంది. కాని ఇక్కడ శ్మశానం చిన్నదే?
స్ట్రెస్, టెన్షన్, స్ట్రెటెన్షన్లకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
భార్య ప్రెగ్నెంట్ అయితే ‘స్ట్రెస్’
గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయితే ‘టెన్షన్’
ఇద్దరూ అయితే ‘స్ట్రెటెన్షన్’
ఒకతను సెలూన్లో గుండు కొట్టించుకుని అప్పుడే బయటకు
వచ్చాడు. టపటమమని వాన వచ్చింది.
అప్పుడు అతను ఇలా పాడుకున్నాడు: ‘కురిసింది వానా నా గుండు
పైనా’
ఒక అమ్మాయి దేవుడిని ఇలా ప్రార్థించింది-
‘నాకు తెలివిగల మొగుడు దొరికేటట్లు దీవించు స్వామి’ అని.
అప్పుడు దేవుడు ఇలా రిప్లై ఇచ్చాడు-
‘అసాధ్యం. తెలివగలవాడు అసలు పెళ్లే చేసుకోడు’
నల్లగా వికారంగా ఉన్న ఓ భర్త తనఅందమైన అప్సరసలాంటి భార్యతో సాయంత్రం విహారానికి బయలుదేరారు.
వీళ్ళను చూసి ఒక ఆకతాయి ‘‘కాకి ముక్కుకి దొండ పండూ..’’ అంటూ పాట పాడాడు.
భర్తకు కోపంవచ్చి వాడిని పట్టుకుని చితక్కొడుతుండటం చూసి దారిన
పోతున్న ఓ ఆసామి ‘దేనికి కొడుతున్నావు?’ అని అడిగాడు.
దానికి భర్త, చూడండి మా ఆవిడను ‘‘కాకి’’అని ఎగతాళి చేశాడు అన్నాడు.
‘‘అన్నా..అసలు అవులింతదేనికి?’’
‘‘పెళ్ళయిన తర్వాత నోరుతెరవడానికి అదొక కారణంగా ఉపయోగపడుతుంది’’.
భార్య: కారు గిఫ్ట్గా అడిగితే నెక్లెస్ తెచ్చావేంటి?
భర్త: మార్కెట్లో ఎక్కడైనా గిల్డుకార్లు దొరుకుతాయా?

Post A Comment:
0 comments: