‘‘అబ్బ... డాక్టర్ రావు నిజంగా ధన్వంతరే. మా ఆవిడ బద్ధకాన్ని, ఆయా సాన్ని ఒక్క దెబ్బకు పోగొట్టాడు’’ సంతోషం గా చెప్పాడు చిదంబరం.
‘‘ఏం మందిచ్చాడేం?’’ కుతూహలం గా అడిగాడు ఏకాంబరం.
‘‘వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నాడు. అంతే!
మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచకా చేస్తున్నది’’ అన్నాడు చిదంబరం.
ఒక క్రైం స్టోరీ
ఒక ఇంట్లో పిచ్చి, మెదడుగాడు, ఫూల్, ఒకరు, ఇంకొకరు, మనిషి, దున్నపోత్...అనే పేర్లు ఉన్న ఏడుగురు కుర్రాళ్లు అద్దెకు ఉండేవారు. ఒకరోజు ఒకరు ఇంకొకరుని చంపాడు. ఆ సమయంలో మెదడుగాడు బాత్రూమ్లో ఉన్నాడు.
పిచ్చి పోలీస్స్టేషన్కి ఫోన్ చేశాడు.
పిచ్చి: ఇది పోలీస్స్టేషనా?
పోలీస్: అవును. మీరెవరు? సమస్య ఏమిటి?
పిచ్చి: నా పేరు పిచ్చి. మా రూమ్లో ఒకరు ఇంకొకరిని చంపాడు.
పోలీస్: మెదడు లేదా?
పిచ్చి: లేకపోవడమేమిటండీ కానీ అప్పుడు వాడు బాత్రూమ్లో ఉన్నాడండీ..
పోలీస్: ఒరేయ్ నువ్వు అసలు మనిషివేనా?
పిచ్చి: అబ్బే నా పేరు మనిషి కాదండీ. మొదటే చెప్పాను కదండీ పిచ్చి అని. మనిషి ఊరెళ్లి ఇంకా రాలేందడీ!
పోలీస్: ఒరే దున్నపోతా... ఎందుకురా ఇలా చంపుతున్నావు?
పిచ్చి: చక్కగా చెప్పారండీ. దున్నపోతుగాడు ఈ మధ్యనే చికెన్షాప్ పెట్టి కోళ్లను చంపుతున్నాడు.
ఒక ఆంగ్ల కవిత
ఇఫ్ యు ఫాల్ ఇన్ రివర్
దేర్ ఈజ్ ఏ బోట్
ఇఫ్ యు ఫాల్ ఇన్ వెల్
దేర్ ఈజ్ రోప్
బట్ ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్
దేర్ ఈజ్ నో హోప్
పరమ సత్యం
‘చిన్న విషయాలే పెద్దగా బాధ పెడతాయి’ ఉదా: ఒక కొండపై కూర్చుంటే ఏంజరగదు. అదే గుండుసూది మీద కూర్చుంటే?
ఎప్పుడూ రాత్రి 3 గంటల వరకూ నైట్డ్యూటీ చేసే పద్మనాభం ఓ రోజు ఒంటిగంటకే డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లాడు. తలుపు తట్టేసరికి - లోపల నుంచి భార్య ‘దొంగా..దొంగా..’ అని గోల చేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా పోగయి
అతడిని కొట్టినంత పని చేశారు. తీరా చూస్తే పద్మనాభం.
ఇదేమిటమ్మా... మొగుణ్ణి పట్టుకుని దొంగ అంటూ అరిచావ్ అని అడిగితే..
‘‘ఏం చేయమంటారు? రోజూ మూడింటికి వచ్చే ఆయన తొందరగా వచ్చేసరికి దొంగేమో అనుకున్నా’’ అని చెప్పిందామె బాధగా.
‘‘డాక్టర్... మీరు అర్జంటుగా మా ఇంటికి రావాలి. మా అబ్బాయి బ్లేడు మింగేశాడు.’’
‘‘మీరేం కంగారుపడకండి.. నేను వెంటనే బయల్దేరి వస్తున్నా... అప్పటివరకూ మీరు...’’
‘‘ఫర్లేదండీ.. నా దగ్గర ఎలక్ట్రిక్ రేజర్ ఉంది. దాంతో షేవింగ్ చేసుకుంటాలెండి.’’
ఇఎన్టి డాక్టర్ కాన్వెంట్ స్కూల్లో హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఒక చిన్నపిల్లవాడ్ని పరీక్షిస్తూ ‘‘బాబూ!
నీకు ముక్కు చెవులతో ఏం ఇబ్బంది రావడం లేదు కదా?’’
‘‘ఎందుకు లేదు... టీ షర్ట్ విప్పేటప్పుడు మాటి మాటికీ అడ్డం వస్తున్నాయి డాక్టర్!’’ జవాబిచ్చాడా బుడుగు.
ఒకతను హోటల్ కెళ్లి రెండు గారెలు తిన్నాడు. కౌంటర్లో పదిరూపాయలుఇచ్చాడు.
నోటు చూశాక కౌంటర్లో ఉన్నతను
‘‘ఈనోటు చెల్లదు... దీనికి పెద్ద కన్నంఉంది చూడు’’ అన్నాడు.
‘‘ఫర్లేదు. నీ గారెకు మాత్రం చిల్లులేదా’’ అన్నాడు గారెలు తిన్నతను.
రామనాథం, జోగినాథం సువర్చల గారింటికి వెళ్ళారు. గేటు వేసి ఉంది.
‘‘జోగినాథం... లోపలకెళ్ళి సువర్చల గారున్నారేమో చూడూ’’ అన్నాడు రామ నాథం.
‘‘అది తెలుసుకుందామనే గదా నేను నిన్ను అడుగుతున్నది...’’ అన్నాడు రామ నాథం.
భర్త రేసులాడటం భార్యకు ఇష్టం
లేదు. అందుచేత ఆమెకు తెలీకుండా రేసులాట మొదలు
పెట్టాడు.
ఓ రోజు అతని స్నేహితుడు ఇంటికొచ్చాడు. మాటల మధ్యలో స్నేహితుడు ‘‘ ఏంట్రా నిన్న రాణి విషయంలో ఏమైనా ప్రయోజనం కన్పించిందా?’’ అని అడిగాడు.
అది విన్న భార్య కోపంగా భర్తకేసి చూసి విసవిసా బయటికి వెళ్ళిపోయింది. భర్త తల పట్టుకుకూర్చుని ‘‘ చంపావ్ ఫో... మా ఆవిడతో ఇప్పుడు రేసులాట్టం లేదని అబద్ధం చెప్పాను. తనని మళ్లీ కూల్ చెయ్యాలి ఎలా’’ అన్నాడు మిత్రునితో...
సర్దిచెప్పే ఉద్దేశంతో మిత్రుడు వెళ్లి ఆవిడ తో ‘‘వదినా మీరు నేనన్న మాటను అపార్థం చేసుకున్నారు. రాణి అంటే గుర్రం పేరనుకున్నారు కదూ... అబ్బేకాదు... మా ఆఫీసు టైపిస్ట్ పేరు రాణి’’ అన్నాడు.

Post A Comment:
0 comments: