apurup, telugu blog, telugu, telugublog, rain, rainny session tips health tips,
వర్షాకాలం నీటి తుంపరులు, శీతాకాలపు చల్లనిగాలులు శరీరంలో మధురానుభూతిని కలిగించడంతో పాటు ఎన్నో వ్యాధులను కలుగచేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు ఈ కాలపు ఆనందాన్ని పాడు చేస్తాయి. ఈ వ్యాధులు పిల్లలలో, వృద్ధులలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో వస్తాయి. ఇవి వారిమీద క్రమంగా పట్టుసాధిస్తాయి. ప్రారంభంలోనే ఈ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన నిమోనియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. 
ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో పిల్లలు,వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. వారి దుస్తులు, ఆహారపానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బిజీగా ఉంటే జీవనశైలి స్త్రీ, పురుషులలో పని సామర్థ్యాన్ని పెంచేసింది. ఆ క్రమంలో మానసిక వత్తిడి, శారీరక, శ్రమ వారిని ఆవరించేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి జీవిత విధానాన్ని మార్చేసింది. ఇది ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం, క్రమంగా శరీర అంతర్గత శక్తిని బలహీనపరిచే శ్వాససంబంధ వ్యాధులు, వత్తిడులు పెరగటం లాంటి సమస్యలకు కారణం అవుతుంది.
 ఈ వర్ష కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో ఇంటి చిట్కాలను పాటించవచ్చు.
ఈ కాలంలో వేడివేడి పదార్థాలను తినండం,. వేడి పానీయాలను సేవించడం మంచిది.
'సి విటమిన్ పుష్కలంగా లభించే పళ్ళు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి  పెరుగుతుంది.
మెంతికూర, పాలకూర లాంటి ఆకుకూరలుముల్లంగి, బీట్రూట్లను ఆహారంలో ఉపయోగించాలి.
పిండితో తయారైన పదార్థాలు, డ్రైఫ్రూట్స్ వేసిన స్వీట్లు తప్పకుండా తీసుకోవాలి. వీటితో శరీరానికి శక్తి అందుతుంది.
అల్లంతో పాటు, డ్రైఫ్రూట్స్ వేసిన పాలు తాగితే శరీరంలో వెచ్చదనం ఏర్పడుతుంది. ఇది జలుబు రాకుండా ఎంతో సహాయకారిగా ఉంటుంది.
 జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలతో తయారైన రొట్టెలు తినడంప్రతిరోజూ నెయ్యి వాడిడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది.
బాదం, జీడిపప్పు, వేరు శనగగుళ్ళు వంటి మీకు ఇష్టమైన నట్స్ తో బెల్లం, ఖర్జూరాలు వంటివి తినవచ్చు..


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: