jokes, fun, fun time, telugu jokes, apurup, telugu blog,
కస్టమర్: నేను ఒక వస్తువు కొన్నప్పుడు మీరు దాంతోపాటు వచ్చే ఫ్రీ అయిటమ్ ఇవ్వట్లేదు.
షాపతను: ఏం ఇవ్వలేదో చెప్పండి.
కస్టమర్: దీంతో పాటు ‘‘కొలెస్ట్రాల్ ఫ్రీ’’ అని రాసుంది కదా... మరి కొలెస్ట్రాల్ ఇవ్వలేదేం?


టీచర్: వారంలో టీతో మొదలయ్యే రెండు రోజుల పేర్లు చెప్పు...
విద్యార్ధి: టుడే, టుమారో


ఓ సైనికాధికారి సైనికులతో సరదాగా-
‘‘ఇక్కడ నేను బిస్కెట్ల డబ్బా పెడుతున్నాను. మీరు శత్రుసేనల మీదపడినట్లు పడి వీటిని తినేయండి’’ అన్నాడు.
సైనికులు బిస్కెట్ల డబ్బాల మీద దాడిచేసి చేజిక్కించుకుని తినసాగారు. ఓ సైనికుడు కొన్ని తీసి తింటూ
మరికొన్ని జేబులో వేసుకోవడం చూసి సైనికాధికారి
 ‘‘బిస్కెట్లు జేబులో ఎందుకు వేసుకుంటున్నావ్ ’’ అని అడిగాడు.
‘‘నేను కొంతమంది శత్రుసేనల్ని పట్టుకొ న్నాను’’ అన్నాడు జవాబుగా.

 ఓ యజమాని ఆఫీసునుండి ఇంటికొచ్చే సరికి నౌకరు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపిం చాడు.
యజమాని: ఎందుకేడుస్తున్నావ్? ఏం జరిగింది.
నౌకరు: అమ్మగారు కొట్టారండీ... వీపు చిట్లిపోయేటట్టుగా చితగ్గొట్టారండి!
యజమాని: వార్నీ... దీనికే ఏడుస్తారా ఎవరైనా? పిచ్చివాడా ... నేను ఏడవడం ఎప్పుడైనా చూశావా నువ్వు?

  
‘‘నువ్వు అయిదొందలివ్వాలి- మర్చి పోయావా?
‘‘లేదు. కొంచెం టైం పడుతుంది’’
‘‘దేనికి?’’
‘‘మర్చిపోవడానికి’’



ఇంటర్వ్యూ జరుగుతోంది.
మేనేజర్: జీతం ఎంత కావాలి?
అప్పారావు: సంవత్సరానికి లక్షరూపాయులు ఇవ్వండి.  ఇంకా ఏ రకమైన బెన్ఫిట్స్ ఉంటాయో ముందే చెప్పండి...
మేనేజర్: రూల్ ప్రకారం హాలిడేస్, ఒక ఫారిన్ట్రిప్, మెడికల్ బెనిఫిట్, రిటైర్మెంట్ తరువాత సగం జీతం పెన్షన్, కంపెనీ కారు, ఫోను....
అప్పారావు: మరి పిల్లల సంగతో...
మేనేజర్: అబ్బే అలాంటివి ఇవ్వం. వాళ్లను మీరే కనాల్సి ఉంటుంది.


భార్య: పెళ్ళికి ముందు మనం ప్రేమించుకొనేటప్పుడు నాకు మీరు బహుమ తులు కుప్పలు తెప్పలుగా తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడెందుకు తేవడం లేదు?
భర్త: నువ్వెప్పుడైనా చేపలు పట్టేవాడు చేపల్ని పట్టి బుట్టలో వేసుకొన్నాక ఎరల్ని తినిపించడం చూశావా?


వెంగళాయిలిద్దరు పట్నం చూడాలన్పించి బయల్దేరారు. ఇద్దరూ ఊరు విడిచి బయటికెళ్ళడం అదే మొదటిసారి. ఇద్దరూ రైల్వేస్టేషన్ చేరు కున్నారు. ఒక బిస్కట్ ప్యాకెట్ కొన్నారు. రైలు రాగానే ఎక్కికూర్చున్నారు. ఇద్దరికీ రైలు ఎక్కడం అదే మొదటిసారి. బిస్కట్లు తినడం కూడా మొదటిసారే. రైలు బయల్దేరింది. ఒకడు ప్యాకెట్ ఓపెన్ చేసి తింటుండగా రైలు ఓ పెద్ద చీకటి సొరంగంలోంచి ప్రయాణించి అవతలకి చేరు కుంది. రెండోవాడు కూడా ఓ బిస్కట్ తీసుకుని తినబోతుండగా మొదటివాడు గాభరాగా
‘‘రేయ్ ఈ బిస్కట్లు తినమాకు. ఇందాకా నేను ఒక బిస్కట్ తింటుండగా కాసేపు కళ్ళు కని పించకుండా పోయాయి’’ అన్నాడు చేతిలోని బిస్కెట్లు బయటపడేస్తూ.


 ‘‘అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది’’ ఘొల్లువ ున్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.
‘‘హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్త దేమోనని భయపడి చచ్చాను’’ నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.



డాక్టర్ నర్స్ తో కలసి  రౌండ్స్ కు వెళ్ళాడు..
ఓ పేషెంట్ వద్దకొచ్చాక అడిగాడు... ‘‘ఇతనేంటి రోజురోజుకూ క్షీణిస్తున్నాడు... నేను చెప్పినట్లు ప్రతి ఎనిమిది గంటలకూ రెండు టాబ్లెట్లు ఇస్తున్నావు కదా?’’
‘‘ఓహ్... సారీ డాక్టర్... ప్రతి రెండు గంటలకూ ఎనిమిది టాబ్లెట్లు ఇస్తున్నా’’ చెప్పింది నర్స్



Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: