- మీరు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటే మీ శిశువు కూడా అలాగే ఉంటుంది .
- ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వంటి బలవర్ధక మైన ఆహరం తీసుకోవాలి.
- డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి. స్వంతంగా మందులు వాడకూడదు.
- అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది. గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
- పొగత్రాగేవారికి, మధ్యపానము చేసే వారికి దూరంగా ఉండండి,
- ఎక్స్-రే తీయించుకోవడం వంటివి చేయకండి.
![]() |
Tips for Pregnants
|
మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.
- ఎత్తు మడమల చెప్పులు వాడకండి.
- కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.
- బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.
- మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు, ఈ క్రింది పేర్కొన్నవి చేయవద్దు :
- దూర ప్రయాణము
- కారు, స్కూటర్ నడపడం.
- అతిగా సంభోగము
- నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది.
- సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు, శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి.
- క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు, మధ్యాహ్నం 1 గంట అవసరము.
- ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి.
- కుటుంబ నియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి.
ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
- రక్తస్రావము
- ఉమ్మనీరు పోవడం
- శిశువు కదలిక తగ్గినట్టుగాని, ఆగినట్టుగాని అనిపించినపుడు
- నొప్పులు రావడం

Post A Comment:
0 comments: