![]() |
| కొబ్బరి కారం |
కావలసినవి:
పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది
ఎండు మిర్చి:
50 గ్రా
దనియాలు: 50 గ్రా
మినప్పప్పు: ఒక స్పూను
శనగపప్పు: ఒక స్పూను
జీలకర్ర: రెండు స్పూన్లు
ఉప్పు, నూనె: తగినంత
తయారి:
పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత
కొబ్బరి తురువను వేయించాలి. దనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి.
ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు.
ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్.

Post A Comment:
0 comments: