అందుకే, విశ్వసించినవారు ఈ నెలను పూర్తిగా పవిత్ర ఖుర్ఆర్ కే అంకితం చేస్తారు. ఖుర్ఆన్ ని
పఠించడానికి, దాన్ని
ఆకళింపు చేసుకొనడానికి తద్వారా జీవితాన్ని సౌభాగ్యవంతం, పునీతం చేసుకోవడానికి, ఆత్మల్ని ప్రక్షాళనం
చేసుకోవడానికి యత్నిస్తారు. ఇలా ఖుర్ఆన్ నేర్పే కరుణానుగ్రహాలను సొంతం
చేసుకుంటారు. ఈ నెలలోనే జకాత్ ని చెల్లించి తమ సంపదలో అగత్యపరులకు, ఉపేక్షితులకు దైవం
నిర్ణయించిన వారి వాటాను అందజేస్తారు. అలా సంపదను పరిశుద్థ పరచుకుంటారు. సుసంపన్నం
చేసుకుంటారు. అందుకే ప్రవక్త మహనీయులు ఈ నెలను సహన సంయమనాల నెల, సానుభూతి నెల అన్నారు. నిజం
చెప్పాలంటే ఈ రమజాన్ నెల ఖుర్ఆన్ నెల!
అనంత
కరుణామయుడు, అపార
కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను :
1-3 అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫలదినానికి స్వామి.
4-7 మేము నిన్నే ఆరాధిస్తాము.
సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు- నీవు అనుగ్రహించినవారూ, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గభ్రష్టులు కానివారూ
అనుసరించిన మార్గము.
1. అల్లాహ్ ఈ ‘ఫాతిహ’ సూరాను తన దాసులకు
నేర్పాడు. వారు దానిని ఒక విన్నపం రూపంలో తమ ప్రభువు సాన్నిధ్యంలో
సమర్పించుకునేందుకు.
2. రబ్ (ప్రభువు)అనే పదం
అరబ్బీ భాషలో మూడు అర్థా లలో వాడబడుతుంది.
- స్వామి, యజమాని
- పెంచేవాడు, పోషించేవాడూ, కాపాడేవాడు, కనిపెట్టి వుండేవాడూనూ.
- చక్రవర్తి, పరిపాలకుడు, యుక్తిపరుడు, నిర్వాహకుడు, అల్లాహ్ ఈ అన్ని అర్థాలలో నూ సృష్టికి ప్రభువు.
3. ఇబాదత్ అనే పదం కూడా అరబ్బీ
భాషలో మూడు అర్థాలలో ఉపయోగించబడుతుంది.
- ఆరాధన, ఉపాసన
- విధేయత, ఆజ్ఞాపాలన
- దాస్యం, బాని సత్వం
- దాసుని ఈ ప్రార్థనకు ఖురాను యావత్తూ జవాబు.
దాసుడు
తన ప్రభువును మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తాడు. ప్రభువు దానికి సమాధానంగా ఈ
ఖురానును అతనికి
ప్రసాదిస్తాడు. అల్
ఫాతిహ
ఆరువేల
ఆరువందల పైచిలుకు వచనాలు, నూటపద్నాలుగు
అధ్యాయాలు, దాదాపు
వెయ్యి పుటల దివ్య ఖుర్ ఆన్ గ్రంథం విషయ వైవిధ్యం రీత్యా అపురూపమయినది. అపారమైన
సాహితీ సౌందర్యలు ఆ గ్రంథానికే ప్రత్యేకం. అనన్యమైన శైలి విషయ విస్తృతికి
అమరిపోయిన ముత్యాలహారం, మానవజీవిత
పుష్పం ఎంత వికసితమయిందో అంతే విశాలమయింది.
- దివ్య ఖుర్ ఆన్ చర్చనీయాంశాల ఫలకం, గగన భువనాలలా సాగర సమీరంలా పరిమితులు, పరిధులు, ఎల్లలు, అవధులు లేవు.
- అందులో ప్రస్తావించిన విషయాల జాబితా అనంతం, అనన్యసామాన్యం. తరగని నిధి అన్నింటినీ సమాధానపరుస్తుంది ఖుర్ ఆన్.
- అన్నింటికీ పరిష్కారాలు చూపెడుతుంది. అందుకే ప్రపంచంలో వెయ్యిన్నర సంవత్సరాల నుండి ప్రతిదినం, ప్రతిచోట, ప్రతి ముస్లిముల ఇంట, ప్రతి మసీద్లో, ప్రతి నమాజ్ లో అనుక్షణం ఎక్కడో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూనే ఉంటారు.
- ఆ దివ్యగ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా, ఎన్నెన్ని విధాలుగా ఆకళింపు చేసుకున్నా, ఎన్నెన్ని కోణాలలో పరిశోధించినా, ఎంతకాలం తరచి తరచి చూసినా దాని శుభాలు తరగవు.
- అందుకే అది శుభాల సరోవరం. విశ్వాసాంశాలు అందులో ప్రతిపాదింన విశ్వాసాల్లో ఒక్కొక్క అంశమూ, అది అవతరించిన రోజుల్లో ఎలా సత్యమని దేదీప్యమానంగా రుజువయిందో, ఎలా నిత్య తను ఘంటపథంగా ప్రకటించిందో అలాగే నేటికీ, ఈ అత్యాధునిక కాలంలోనూ నిత్యనూతనంగా పచ్చపచ్చగా, రెపరెపలాడుతూ ఉంటుంది దాని నమ్మకాల బావుటా.
అంతేకాదు, కాలం ముందుకు సాగినకొద్దీ ఆ
విశ్వాసాల సత్యత, నిత్యత మరీ
మరీ రూఢీ అవుతూ ఉంటుంది. దాని విశ్వాస ప్రాతిపది కలు ముఖ్యమయినవి మూడు.
ఒకటి
దేవుని ఏకత్వం
అజ్ఞానపు
తెరలు తొలిగి మనిషి జ్ఞానపరిథి విస్తృతమయిన ప్రతిసారీ మూఢనమ్మకాల ఊబిలో నుంచి
బయటపడి క్రమేణ దేవుని ఏకత్వపు స్వేచ్ఛాయుత రాచబాట వైపునకు హేతుబద్ధంగా అడుగుముందుకు
వేస్తున్నాడు మనిషి. మానవులంతా ఒకేజాతి, మానవజాతి అయినప్పుడు, మానవునికీ ఈ సృష్టియావత్తుకూ కర్త ఒక్కడే అయినప్పుడు, విశ్వవ్యవస్థ పరిపాలనను
కూడా ఒకేశక్తి నిర్వహిస్తున్నప్పుడు, మానవుని ఆరాధనకు,
పూజకు, భక్తికీ
అన్యులు ఎలా అర్హులవుతారు? ఈ
సత్యాన్ని నేడు గ్రహించగలిగాడు ఆధునిక మనిషి, దేవుడు ఒక్కడే అన్న ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు మనిషి.
అలాగే
రెండవ ప్రధాన విశ్వాసాంశం దైవ దౌత్యం.
అదొక పరిమళం. వెలుగు, ఎంత వాడు కున్నా తరగని గని, ఎల్లలు లేని పరిధి. ఈ
గజిబిజి ప్రాపంచిక జీవన వ్యవస్థలో మానవునికి సరయిన అనుసరణీయమయిన, ఆనందకరమైన, ఆహ్లాదకర మయిన మార్గమేదో, జీవితపు అనేక
చిక్కుముడుల్ని విడదీసే మూలమంత్రమేదో, అసంఖ్యాక సమస్యల కీకారణ్యం నుండి బయటపడే పరిష్కార మేమిటో ఎవరు
చెప్పాలి? మానవుని
సకల ప్రశ్న లకు సహేతుక సమాధానం ఒక్కటే - అదే సృష్టికర్త, ప్రభువు పాలనాధికారం గల
స్వామి దైవం మాత్రమే ఆ దారి చూపగలడు. నిజం! ఆ దేవుడే తన మార్గదర్శక గ్రంథాలను
అందజేయవలసిందిగా సచ్ఛీలురయిన తన దాసులను నియమించారు. వారే తన ఆదేశాలను పాలించే
ఆదర్శమూర్తులుగా ప్రకటించారు. అటువంటి మార్గబోధనల్లో కడపటి గ్రంథమే దివ్య ఖుర్
ఆన్. అటువంటి జ్ఞానబోధకుల్లో అంతిమ దైవసందేశహరుడే మహమ్మద్(సల్లల్లాహు అలైహి
వసల్లం).
ఖుర్
ఆన్ ప్రతిపాదించే మూడవ విశ్వాసం పరలోక జీవితం
ప్రపంచంలో
జన్మించిన ఒక్కొక్క మానవుడు నశిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్కడూ మిగలటం లేదు. మానవలోకమూ
నశిస్తుంది. ఇహలోకం, ఇహలోక
జీవితం, ఈ విశ్వ
వ్యవస్థ అంతానశ్వరమయినదే. ఒకనాడు అంతా అంతమయిపోవలసిందే. అది మానవునికి అనుభవైక
సత్యం.అందుకే పుట్టుట, గిట్టుట
కొరకే అన్న నానుడి పుట్టింది.
అయితే ఈ జీవితం ఏమిటీ? ఈ మరణం ఏమిటీ? ఈ జీవితం అంతమయిన తరువాత జరిగే దేమిటీ? కేవలం వినోదం కొరకేనా ఈ జీవన కళ తొణికిసలాడేది? అనే ప్రశ్నలు మటుకు
మిగులుతాయి.
ఈ ప్రశ్నలకు సమాధానమే ఖుర్ ఆన్. పరలోక జీవితం మరణంతో ముగియదు. ఒక దశ
దాటి మరో దశలోకి ప్రవేశద్వారమే తప్ప మరణం మరేమి కాదు. అక్కడ ఆది నుండి అంతం వరకు
ప్రభవించిన మానవులంతా ఈ ప్రపంచం దాటి మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అక్కడి ప్రమా
ణాలు వేరు. అక్కడి తులమానాలు వేరు. అక్కడ సత్యమే బరువు. సత్యానికే విలువ.
సత్యానికి తప్ప అసత్యానికి శరణు గోరినవారు పరలోకంలో పరాజితులవుతారు. ఈ జీవితం
కేవలం ఓ పరీక్షా వ్యవస్థ ఇక్కడ ప్రతి మనిషీ అనుక్షణం పరీక్షింపబడుతున్నాడు. పరీక్ష
తరువాత ఫలితాల దశయే ప్రళయ ఛట్టం. పరీక్షలో నెగ్గాలంటే మానవులు, తమ స్వామి పంపిన
మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలి. దాన్నే అనుసరించాలి. అలా అనుసరింనవారు పరీక్షలో
సఫలీకృతులవుతారు. అనంత సౌభాగ్యాలకునోచుకుంటారు. దైవప్రబోధాలను కాదన్న వారు
నిష్ఫలురవుతారు. శాశ్వతంగా నష్టానికి లోనవుతారు. ముగియని నరకయాతనకూ గురవుతారు. ఇదీ
ఆ మూడు ప్రధాన విశ్వాసాల సారాంశం.
దైవగ్రంథం-
దైవధర్మం
ఖుర్ ఆన్
బోధనలకు భూమిక ఇది. ఖుర్ ఆన్ మానవాళికి ఇచ్చే ప్రముఖ సందేశం కూడా ఇదే. దీని
ఆధారంగా ఒక సంపూర్ణ జీవన వ్యవస్థను నిర్మిస్తుంది ఖుర్ఆన్. అది మానవ జీవితాన్ని
ఖండికలు ఖండికలుగా విభజించి వేర్వేరు మార్గాలను, వేర్వేరు విధానాలను ప్రతిపాదించదు. జీవితం ఒక
సంపూర్ణమయిన సమగ్రమయిన ఏకాంకమన్న యధార్థాన్ని ఆధారంగా సముతమయిన సహేతుకమైన, సమంజసమైన ఒకే జీవన
వ్యవస్థను ప్రతిపాదిస్తుంది.
- ప్రాపంక వ్యవహారాలు వేరు, పరమార్థిక వ్యవహారాలు వేరని సిద్ధాంతీకరించే వారితో ఏకీభవించదు. ప్రపంచం ద్వారానే పరమార్థాన్ని సాధించాలని సూచిస్తుంది. భౌతికతత్వానికి ఆధ్యాత్మికతత్వంతో తాదాత్మ్యం చేకూరే సమక్య జీవన తత్వాన్ని రూపొందిస్తుంది. ఇదే ఖుర్ ఆన్ ప్రబోధాల సారం.
- ఖుర్ ఆన్ రచించిన గ్రంథం కాదు. దాన్ని మానవాళికి అందజేసిన ప్రవక్త (స) రచింనదీ కాదు. తానే దాన్ని రచింనట్లు ఆయన కూడా ఎన్నడూ చెప్పలేదు. ఇది దైవగ్రంథం. అందువల్ల ఈ గ్రంథం ప్రతిపాదించే ధర్మం మానవకల్పిత ధర్మం కాదు. ఆ ధర్మం కూడా దైవం రూపొందించిన ధర్మమే. ఇది దైవగ్రంథమని, దీని ధర్మం దైవ ధర్మమని ఖుర్ ఆన్ స్వయంగానే ప్రకటించుకుంది.
వచనాలు
- ఇది (ఖుర్ఆన్) దైవగ్రంథం, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. భయభక్తులు గలవారికి మార్గదర్శకం. (ఆల్ బకఱ్ :2)
- ఇది (ఖుర్ఆన్) అసాంతం మానవులకు మార్గదర్శకం, అందులో విస్పష్టమైన బోధనలున్నాయి, అవి రుజుమార్గాన్ని చూపుతాయి. సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి తెలుపుతాయి (ఆల్ బకఱ్ : 185)
- ఇది (ఖుర్ఆన్ జనులకు ఒక స్పష్టమైన, విశదమయిన హెచ్చరిక, దైవానికి భయపడేవారికి మార్గనిర్దేశన హితబోధన ( అల్ ఇమ్రాణ్ : 138)
- మేమే ఈ (ఖుర్ అన్) గ్రంథాన్ని అవతరింపచేశాము. మేమే దీన్ని భద్రపరిచేవారము కూడా (ఆల్ హిరజ్ : 9)
- ప్రవక్త స్వయంగా ఈ గ్రంథం రచించాడని ఈ జనం అంటున్నారా? వారికి చెప్పు ‘‘సరే నిజమ యితే దీనిలాగే రచింన పది సూరాలు మీరు కూర్చి తీసుకురండి అల్లాహ్ తప్ప ఎవరెవరు (మీ ఆరాధ్యులుగా) ఉన్నారో (వారిని ఆరాధ్యులని భావించడంలో) మీరు సత్యవంతులే అయితే, వారిని సహాయానికి పిలుచుకోగలిగితే పిలుచుకోండి’’ (హూద్ : 13)
- మా దాసునికి మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మేము పంపినదో కాదో అన్న సందేహం మీకు ఉన్నట్లయితే ఇలాంటి సూరా ఒక్కటి అయిన రచించి తీసుకురండి, సహాయం కొరకు మీ తోటివారందరినీ పిలిపించుకోవచ్చు. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయమయినా పొందవచ్చు. మీరు నిజాయితీపరులయితే ఇది చేసి చూపండి (బకఱ్ : 23)
- ప్రవక్త స్వయంగా దీనిని రచించుకున్నాడని వీరు అంటున్నారా? చెప్పు ‘‘ఈ ఆరోపణలో మీరు నిజాపయితీ పరులే అయితే ఒక్క సూరా ఇటు వంటిది రచించి తీసుకురండి, ఒక్క దైవాన్ని వదలి ఎవరెవరిని పిలుచుకోగలుగుతారో తోడుగా పిలుచుకోండి. (యూనుస్ : 38).


Post A Comment:
0 comments: