కాకరకాయ కారం
![]() |
| కాకరకాయ కారం |
కావలసినవి:
కాకరకాయలు : ఒక కిలో
ఎండు మిర్చి:
100 గ్రా
చింతపండు: 50 గ్రా
దనియూలు: 50 గ్రా
వెల్లుల్లి: 50 గ్రా
జీలకర్ర : రెండు స్పూన్లు
శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను
ఉప్పు, నూనె: తగినంత
తయారి:
దీనికి రెండు రోజులు పని చేయాలి.
ముందు రోజు కాకరకాయలను చిన్న వక్కలు చేసి ఎండబెట్టాలి.
మరుసటి రోజు నూనెలో వేయించిపొడి చేయాలి. మిరపకాయులు, దనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు,
మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడిచేయాలి.
ఈ మిశ్రమంలో కాకరకాయ
వక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ.

Post A Comment:
0 comments: