![]() |
| Eye sight |
పగటి పూట సినిమా హాల్లో లైట్లు ఆర్పి వేసిన తర్వాత లోనికి
వెళ్లిన వారికి వెంటనే లోపలి మనుషులు గానీ, సీట్లు గానీ స్పష్టంగా కనపడవు. కొంచెంసేపటి తర్వాత చూపు
స్పష్టం అవుతుంది. బయటి కాంతిని బట్టి మనం కంటిలోని కనుపాప తన ఆకా రాన్ని
సరిచేసుకుంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప పెద్దది అవుతుంది. దీనివల్ల
కంటిలోనికి ఎక్కువ కాంతి ప్రసరిస్తుంది. ఎండలో ఉన్నప్పుడు కనుపాప సంకోచిస్తుంది.
అందువల్ల ఎక్కువ వెలుతురులో నుంచి తక్కువ వెలుతురులోకి వెళ్లినప్పుడు కనుపాప ఆ
కాంతికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చీకటిలోకి వెళ్లిన
వెంటనే వస్తువులు స్పష్టంగా కనిపించవు. దీంతోపాటూ ఇంకొంచెం లోతుగా ఈ విషయాన్ని
తెలుసుకోవాలంటే కంటిలో రెటీనాలో ని ‘రొడాప్సిన్’ అనే పదార్థం ఎక్కువ వెలుతురులో ఎక్కువ శాతంగా, చీకటిలో తక్కువ
శాతంగా వుంటుంది. రొడాప్సిన్ వల్లనే వస్తువును చూసే సంకేతాలు మెదడుకు వెళతాయి.
దీని వల్లే ఇలా.

Post A Comment:
0 comments: