![]() |
| First Rain |
తడిసిన మట్టి నుండి ఒక విధ మైన ఆహ్లాదకర మైన వాసన వస్తుంది.
వర్షం కురిసినప్పుడు ఇటువంటి వాసన రావడం వల్ల ఇది వర్షం వల్ల వచ్చే వాసన అని చాలా
మంది భావిస్తారు. నిజానికి వర్షానికీ, ఈ మట్టి వాసనకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది
వర్షపు నీటి వల్ల వచ్చే వాసన కాదు. రెండు మూడు రోజులు వరుసగా వర్షం కురిస్తే
ఇలాంటి సువాసన రాదు. ఎండిన మట్టి నేల మీద దుమ్ముతో కలిసి వ్యాపించిన
యాక్టినోసిటేల్స్ జాతికి చెందిన సిరప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా నీటిలో
తడిసినప్పుడు ఈ విధమైన వాసన రావడానికి కారణం అవుతాయి. అంటే ఈ బ్యాక్టీరియా ఎండిన
నేలలో పెరిగి నేల తడిసినప్పుడు కలిగే చర్యవల్ల ఒక మంచి వాసన
వ్యాపింపచేస్తాయన్నమాట.

Post A Comment:
0 comments: