పుస్తకం...
Birmingham Central Library
నోరు తెరవని మహా వక్త. పుస్తకం మన మదిలో విజ్ఞానాన్ని నింపుతుంది. అందుకే చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ, మంచి పుస్త కాన్ని కొనుక్కోవడం మరచిపోవద్దు అన్నాడో జ్ఞాని. అనేక రకాల పుస్తకాలు... దిన, వార, పక్ష, మాస పత్రికలు లభించే చోటునే గ్రంథాలయం అంటారుసాధారణంగా ఎక్కడైనా సరే, గ్రంథాలయంలో ఉచిత ప్రవేశం లభిస్తుంది. అక్కడే కూర్చుని పుస్తకాలు చదువుకోవచ్చు. కొన్నింటిలో నామమాత్రపు సభ్యత్వ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉందీ అంటే... 
ఇంగ్లండులో. యూరప్లోనే అతిపెద్దదిగా రికార్డుల కెక్కిన గ్రంథాలయం ఉంది. 200 అడుగుల ఎత్తుతో, తొమ్మిది అంతస్థులతో, గాజుతో నిర్మించిన భవనంలో ఒకేసారి మూడువేలమంది కూర్చోవచ్చు. ఇరవై లక్షల పుస్తకాలున్న గ్రంథాలయాన్ని ఏటా సుమారు ముప్ఫై లక్షలమంది పాఠకులు ఉపయోగించుకోవచ్చని అంచనా. 200 కంప్యూటర్లు ఉన్నాయి.సుప్రసిద్ధ నాటక రచయిత విలియం షేక్స్పియర్జ్ఞాపకార్థం నిర్మించిన భవనం చివరి అంతస్థులో సుమారు 40 వేల గ్రంథాలున్నాయట. అంగుళం పరిమాణంలోఉన్న అతి చిన్న పుస్తకం నుంచి, యాభై అరవై కేజీలున్న అతి పెద్ద పుస్తకాల వరకూఇందులో ఉన్నాయట. అన్నట్లు గ్రంథాలయం పేరే లైబ్రరీ ఆఫ్బర్మింగ్హామ్‌.మనదేశంలో కూడా ఎన్నో మంచి గ్రంథాలున్నాయి కానీ, అవేవీ ఇంత పెద్దవి కావు.అంతకుముందు బర్మింగ్హామ్సెంట్రల్లైబ్రరీ పేరుతో ఉన్న భవనాన్ని ఇటీవలే పునర్మిర్మించి, పేరు మార్చారు.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: