ఆకాశం నీలంగా వుండటం మనోహర దృశ్యంగా కనిపిస్తుంది. అయితే
ఆకాశం నీలిరంగులోనే ఎందుకు వుంటుంది?
![]() |
| Blue Sky |
సూర్యుడు వెలుగును ఇస్తుంటాడు. సూర్యకిరణాలలో ఏడు రంగులు
వుంటాయి. అవి ఊదా, నీలం, ఇంద్రనీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ, ఎరుపు రంగులు. ఇక భూమి చుట్టూ వాతావరణం పొరలాగా ఆవరించి
వుంటుంది. ఈ వాతావరణంలో నీటి ఆవిరి, దుమ్ముకణాలు, ప్రాణవాయువు
మొదలైనవి వున్నాయి. సూర్యకిరణాలు వాతావరణం లోని కణాలతో కలుస్తాయి. అప్పుడు ఊదా,
నీలం, ఇంద్రనీలం రంగులు ఎక్కువగా చెల్లాచెదరు అవుతాయి. ఈ మూడు
రంగులూ కలిసి నీలంగా కనిపిస్తాయి. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. అయితే
భూమినుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఈ వాతావరణం లేని చోటు వుంటుంది. అది భూమికి 100 నుండి 120 మైళ్ల ఎత్తులో
ప్రారంభం అవుతుంది. అంతకంటే ఎక్కువ పైకి వెళ్లి చూస్తే ఆకాశం నీలంగా కనిపించడానికి
బదులు నల్లగా కనబడుతుంది. అంటే భూమిలోని వాతావరణం వల్లనే ఆకాశం నీలంగా
కనబడుతోందన్నమాట!

Post A Comment:
0 comments: