క్యారెట్ తరుగు - 1 కప్పు, బీన్స్ తరుగు - 1 కప్పు, లేత మొక్కజొన్నగింజలు - 1 కప్పు, బాస్మతి బియ్యం - అర కప్పు, గోధుమ పిండి - అర కప్పు, దాల్చిన చెక్క - ఒక ముక్క, లవంగాలు - 3, ఏలకులు – 3, జీలకర్ర - అర టీ
స్పూను, గులాబీ రేకులు - 1
టీ స్పూను, ఎండుమిరపకాయలు – 2, శొంఠిపొడి - అర టీ స్పూను, జాజిపొడి - చిటికెడు, అల్లం పేస్ట్ - 1 టీ స్పూను, ఉల్లిగడ్డ తరుగు - 1 కప్పు, జీడిపప్పులు – గుప్పెడు, బాదం పప్పులు – గుప్పెడు,
నెయ్యి - అర కప్పు, నీళ్ళు - 2
కప్పులు, రిఫైండ్ అయిల్ - 4
టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు -
2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారి :
కూరగాయ ముక్కలకు నీళ్ళు కలిపి
ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. బాస్మతి బియ్యం ఒక గంటపాటు నానబెట్టి కూరగాయల
మిశ్రమానికి కలపాలి. కూరగాయల మిశ్రమం, బియ్యం కలిశాక గోధుమ పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ ల
తయారయ్యే వరకు కలుపుతూ వుండాలి. మిశ్రమమంతా పేస్ట్ ల తయారయిన తరువాత నెయ్యి, మసాలా దినుసులన్నీ కలిపి ఉడికించాలి.
బాణలిలో నూనె వేడిచేసి తరిగిన ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్ కలిపి వేయించి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్ లో
హలీమ్ తీసుకుని వేయించిన ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు పైన చల్లి నెయ్యి రెండు టీ స్పూన్లు
వేసుకుని వేడివేడిగా తింటే రుచిగా వుంటుంది.

Post A Comment:
0 comments: