![]() |
| కరివేపాకు కారం |
కావలసినవి:
కరివేపాకు: పావుకిలో
ఎండు మిర్చి: 100గ్రా
చింతపండు: 50గ్రా
వెల్లుల్లి: 50గ్రా
జీలకర్ర : రెండు స్పూన్లు
దనియూలు: 100గ్రా’’
పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు
మినప్పప్పు: రెండు స్పూన్లు
నూనె: వేయించడానికి కావలసి నంత
తయారి :
కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి.
దానిని
పక్కన ఉంచి మిరపకాయలు,
దనియాలు,
జీలకర్ర,
పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది.
అన్నంలో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం
నుంచి స్వస్థత పొందిన
వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోర హితవు పుడుతుంది.త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివే
పాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది.

Post A Comment:
0 comments: