కావలసినవి :
![]() |
| Chicken Halim (చికెన్ హలీమ్ (హర్రీస్)) |
చికెన్ - 1 కేజి, బాస్మతి బియ్యం - 1 కప్పు, గోధుమ పిండి - 1 కప్పు, దాల్చిన చెక్క – ఒక ముక్క, లవంగాలు - 4,
ఏలకులు - 4, జీలకర్ర - అర టీ
స్పూను, గులాబీ రేకులు - 1
టీ స్పూను, ఎండు మిరపకాయలు -
2, అల్లం పేస్ట్ - 1
టీ స్పూను, ఉల్లి తరుగు - 1
కప్పు, జీడిప ప్పులు - గుప్పెడు, బాదం పప్పులు - గుప్పెడు, నెయ్యి - అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ - 4 టీ స్పూన్లు, నీళ్ళు - 2 కప్పులు, కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారి :
చికెన్ శుభ్రపరచి నీళ్ళుపోసి
ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. బాస్మతి బియ్యం ఒక గంటపాటు నానబెట్టి చికెన్ లో
కలపాలి. చికెన్, బియ్యం కలిశాక
గోధుమ పిండిని కల పాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ ల తయారయ్యే వరకు కలుపుతూ వుండాలి.
మిశ్రమమంతా పేస్ట్ ల తయారయిన తరువాత నెయ్యి, మసాలాదినుసులు కలిపి ఉడికించాలి. బాణలిలో నూనె వేడిచేసి
తరిగిన ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్
కలిపి వేయించి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్ లో హలీమ్ తీసుకుని వేయించిన ఉల్లి గడ్డ, కొత్తిమీర తరుగు పైన చల్లి నెయ్యి రెండు
టీ స్పూన్లు వేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.

Post A Comment:
0 comments: