సొరకాయ తురుము - 2 కప్పులు పాలు – 1, లీటరు, పంచదార - 2
కప్పులు, కోవా – 2, కప్పులు,
సగ్గుబియ్యం - అర కప్పు, బాదం, పప్పులు - గుప్పెడు, పిస్తా – గుప్పెడు, మిల్క్ మైడ్ (మార్కెట్ లో దోరుకుతుంది) - 1 కప్పు , పైనాపిల్ ముక్కలు - అర కప్పు, నెయ్యి - 2 టీ స్పూన్లు
తయారి :
సొరకాయ తురుమును ఉడికించి నీళ్ళు
వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాదం,
పిస్తా నెయ్యిలో వేయించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగబెట్టి
సగ్గుబియ్యం కలిపి ఉడికాక కోవా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత పంచదార కలిపి
కరిగాక స్టౌపై నుంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లబరచి ఉడికింన సొరకాయ తురుమును
కలుపుకోవాలి. చివరిగా పైనాపిల్ ముక్కలు, వేయించి వుంచిన బాదం, పిస్తా కలుపుకోవాలి.

Post A Comment:
0 comments: